శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 23 జనవరి 2017 (06:09 IST)

నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు బాబయ్యా: ఓటర్లను వేడుకుంటున్న బీజేపీ అభ్యర్థులు

ఇన్నాళ్లుగా నోట్లరద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థే పెను గంతు వేస్తుందంటూ కోట్లమంది ప్రజల బాధలను ఏమాత్రం పట్టించుకోకుండా క్యూలలో ప్రజలను చూసి అపహాస్యపు వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నట్లుంది. కారణం ఎన్నికలే. నోట్ల రద్దు అసెంబ్లీ ఎన్న

ఇన్నాళ్లుగా నోట్లరద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థే పెను గంతు వేస్తుందంటూ కోట్లమంది ప్రజల బాధలను ఏమాత్రం పట్టించుకోకుండా క్యూలలో ప్రజలను చూసి అపహాస్యపు వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నట్లుంది. కారణం ఎన్నికలే. నోట్ల రద్దు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పుట్టి ముంచుతోందని గ్రహించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు సరికొత్త పల్లవి అందుతుంటున్నారు. అదేంటో తెలుసా.. ‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు బాబయ్యా’.
 
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా నోట్లరద్దుపై జనం ఇంకా ఆగ్రహిసూనే ఉన్నారని బాగా వంటబట్టిన ఒక అభ్యర్థి ప్రజలను వేడుకుంటూ ఇదే పాట పాడుతున్నారు నోట్లరద్దు పాపంతో నాకే సంబంధమూ లేదు. ఎవరో చేసిన నిర్ణయానికి నన్ను శిక్షించొద్దు. మే మేలు కోరేవాడిని, మీకోసమే కష్టపడుతున్నా. ఈసారీ నన్నే ఎన్నుకోండి బాబూ.. అంటూ ఆ అభ్యర్థి వేడుకుంటుండటం వింత గొలుపుతోంది.
 
అమృత్‌ సర్‌ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీకి చెందిన పంజాబ్‌ మంత్రి అనిల్‌ జోషి ‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాకు సంబంధం లేదు. దీనికి నన్ను శిక్షించొద్ద’ని తన నియోజక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.  మరోసారి బరిలో నిలిచిన జోషీ ఎవరో తీసుకున్న నిర్ణయానికి తనను శిక్షించొద్దంటూ ఓటర్లను మరీ మరీ  వేడుకొంటున్నారు.
 
అంతేకాదు. కార్యకర్తలను కూడా ఓటర్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘నా పదవీ కాలం ముగిసింది. ఈ ఒక్క నెల మీరందరూ కష్టపడాలి. ఓటర్ల దగ్గరకు వెళ్లి నాకు ఓటు వేయాలని కోరండి. పాత నోట్ల రద్దు నిర్ణయంతో అంతా తల్లకిందులయిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. దీనిపై ఇప్పుడేమీ చేయలేమని సముదాయించండి. ఇందులో అనిల్ జోషి పాత్ర లేదని చెప్పండి. జోషి ఎప్పుడూ మీ తరపున పోరాడతాడని ప్రజలకు తెలపండి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు జాగ్తత్తగా వ్యవహరించాల’ని జోషీ తన మద్దతుదారులకు సూచించారు.
 
ఇన్నాళ్లకయినా నోట్ల రద్దు వల్ల ప్రజలు బాధలు పడ్డారనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించడం విశేషం. ఇది ఎన్నికల కాలం కదా మరి.