గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (10:52 IST)

పోలీసు ఉద్యోగాలకు వచ్చారు.. అడ్డంగా బుక్కయ్యారు.. డోప్ టెస్టుల్లో చిక్కిన 120 మంది అభ్యర్థులు

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు డోప్ టెస్ట్లు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా నిర్వహించిన పరీక్షల్లో 120 మంది అభ్యర్థులు ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించారు.

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు డోప్ టెస్ట్లు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా నిర్వహించిన పరీక్షల్లో 120 మంది అభ్యర్థులు ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించారు. 
 
శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మత్తుపదార్థాలు వాడినట్టు ఈ పరీక్షల్లో వెల్లడైంది. అభ్యర్థులు మార్ఫిన్, ప్రొఫోగ్జిఫిన్, ఆంఫీటమైన్, కన్నాబిస్‌లాంటి ఉత్ప్రేరకాలను వాడుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. 
 
వీరందరి వద్ద మరో శాంపిల్ తీసుకొని పరీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవే ఫలితాలు పునరావృతమైతే.. వారిని రిక్రూట్మెంట్ నుంచి తప్పించడంతో పాటు, ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తామని వారు తెలిపారు.
 
పక్క రాష్ట్రం హర్యానాలో ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ సందర్భంగా మత్తు పదార్ధాలు వాడిన నలుగురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో పంజాబ్ రాష్ట్రం కూడా ఈ తరహా పరీక్షలను నిర్వహిస్తోంది.