గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (12:59 IST)

జయలలిత వంట మనిషిపై మారణాయుధాలతో దాడి.. ఎవరై ఉంటారు..?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ హత్య, ఆపై అమ్మ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు మరిచిపోకముందే.. జయమ్మ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంజవర్ణం అనే వ్యక్తి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ హత్య, ఆపై అమ్మ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు మరిచిపోకముందే.. జయమ్మ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంజవర్ణం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో వంటమనిషి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. 
 
శనివారం నాడు కూడ గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తృటిలో తప్పించుకొన్నాడు. శివగంగ జిల్లాకు చెందిన పంచవర్ణం జయ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు.
 
పంచవర్ణం కుమారుడు అన్నాడిఎంకె ప్రభుత్వహయాంలో పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ దాడికి సంబంధించి సైదాపేట పోలీసులు కేసును తీసుకోకపోవడంతో బాధితులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆళగును మురుగేషన్‌ను ఆశ్రయించారు.