Widgets Magazine

తప్పతాగి కారు నడిపిన యువతి.. ఇద్దరు స్టూడెంట్లు దుర్మరణం.. ఎక్కడ?

సోమవారం, 12 మార్చి 2018 (10:27 IST)

మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో వున్న యువతి కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 
 
హడ్సన్ లైన్స్‌ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని తప్పతాగి బండి నడిపిన యువతి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఇద్దరు స్టూడెంట్లు రితేశ్ దహియా, సిద్దార్థ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
 
స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కారు బోల్తా పడిందని.. డీసీపీ అస్లాం ఖాన్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం నిందితురాలిని అరెస్టు చేశామని అస్లాం ఖాన్ తెలిపారు. తప్పతాగి బండి నడిపిన యువతికి లెర్నల్ లైసెన్స్ వుంది. వారంతా నోయిడాలోని అమితీలో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోదీపై అంత విశ్వాసం వుంటే.. ఇక అవిశ్వాసం ఎందుకయ్యా?: బాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ ...

news

జాతిపితను చంపిన గాడ్సే నెం.1 హిందూ టెర్రరిస్ట్: అసదుద్ధీన్ ఓవైసీ

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ ...

news

భార్య ప్రేమించింది.. ప్రేమికుడితో వివాహం జరిపించిన భర్త.. ఎక్కడ?

భార్య ప్రేమించిందని.. పెళ్ళయ్యాక తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..? భార్యకు ఆమె ప్రేమికుడి ...

news

ఈడా ఉంటా... ఆడా ఉంటా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అనే పేరుతో ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు ...

Widgets Magazine