Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వం ఔట్.. సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:03 IST)

Widgets Magazine
edappadi palaniswamy

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో శశికళతో పాటు... ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రి పీఠంపై పెట్టుకున్న ఆశలు అడియాశలై పోయాయి. దీంతో తన వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. కూవత్తూరు రిసార్ట్స్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. అదేసమయంలో పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 
 
ఇదిలావుండగా, మరికొన్ని గంటల్లో జైలు ఊచలు లెక్కించేందుకు వెళ్లనున్న శశికళ... రాజకీయంగా కాస్తయినా తన పట్టు నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సీఎం పీఠం తనకు దూరమైనప్పటికీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్ సెల్వానికి మాత్రం దక్కకూడదనే పట్టుదలతో ఆమె వ్యవహరిస్తున్నారు. అందుకే తనకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే, రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు అండగా నిలుస్తారో వేచి చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కూవత్తురుకు పోతున్నా.. ఎమ్మెల్యేల వద్దకు పన్నీర్ సెల్వం.. శశికళను జైలుకు పంపి..?

అన్నాడీఎంకే పార్టీలో అమ్మ మరణానికి తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీం ...

news

శశికళను దోషిగా ప్రకటించడం చారిత్రాత్మకం : ఎంకేస్టాలిన్

జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ ...

news

తమిళ రాజకీయాలపై సోషల్ మీడియాలో జోకులే జోకులు.. పన్నీర్‌‌ను కబాలీతో పోల్చిన నెటిజన్లు

తమిళ రాజకీయాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తమిళ పీఠం కోసం పోటీ పడిన ఆపద్ధర్మ ...

news

శశికళ సినిమా చూపించింది- మద్యం, అమ్మాయిల సరఫరా పచ్చి అబద్ధమే.. మారువేషంలో గోడదూకి?

తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ...

Widgets Magazine