రాహుల్‌‍ను "పప్పు" అనకూడదు.. మరి లోకేశ్‌ను...

బుధవారం, 15 నవంబరు 2017 (16:29 IST)

rahul lunch

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అంటూ పిలవడానికి వీల్లేందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు నిషేధం విధించింది. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ నేతలు రాహుల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులోభాగంగా, రాహుల్‌ను పప్పు అంటూ సంబోధిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 
 
దీనికి సాక్ష్యాలుగా బీజేపీ నేతల ప్రసంగాల స్క్రిప్టును కూడా పంపింది. ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన ఓ ప్రకటనలో సైతం రాహుల్‌ను 'పప్పు' అని బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. 'పప్పు' అన్న పదం అభ్యంతరకరమేనని తేల్చింది. ఓ నేతను అలా పిలవడం అవమానించడమేనని పేర్కొంటూ, ఆ పదాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. 
 
ఇదిలావుండగా, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను వైకాపా నేతలు పదేపదే పప్పూ.. పప్పూ అంటూ సంబోధిస్తున్నారు. ముఖ్యంగా, సెర్చింజన్ గూగుల్‌లో కూడా పప్పు అని టైప్ చేస్తే లోకేశ్ పేరే వస్తోంది. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, వైకాపా నేతలు మాత్రం ఆ పదాన్ని మరింతగా వాడుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్రా?(వీడియో)

వైఎస్సార్సీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్ర అంటూ ...

news

గోరఖ్‌పూర్‌లో దారుణం.. ఇంటికెళ్లి.. యువతిని చితకబాదారు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్ గోరఖ్ ...

news

అసెంబ్లీకి డుమ్మాకొట్టి అమ్మాయిలతో స్టెప్పులేసిన హీరో... (వీడియో)

ప్రజాప్రతినిధులు ప్రజలు చెల్లించే పన్నులను సొమ్మును వేతనంగా తీసుకుంటా, తమ కర్తవ్యాన్ని ...

news

ముంచుకొస్తున్న ముప్పు.. మానవజాతికి మూడనుంది!

భూగోళానికి ముప్పు ముంచుకొస్తోంది. మనుష్య జాతి దుశ్చర్యలతో భూగోళానికి పెను ముప్పు ...