Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జమిలి ఎన్నికలకు సిద్ధం.. చెప్పడమే తరువాయి : ఈసీ

సోమవారం, 9 అక్టోబరు 2017 (06:16 IST)

Widgets Magazine
op rawat

'వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌' అనే నినాదంలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. అయితే దాని కంటే ముందు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. 
 
వచ్చే యేడాది సెప్టెంబరు తర్వాత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఈసీ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఓపీ రావత్ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. దీనివల్ల ప్రభుత్వాలు తమ అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించే వీలుంటుంది. ఎన్నికల కోడ్‌లాంటివి అడ్డు రావు అని రావత్ అన్నారు. 
 
అయితే ఇది జరగాలంటే రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అవి పూర్తయిన తర్వాత ఆరు నెలలకు ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా ఎన్నికలు 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించాల్సి ఉంది. జమిలి ఎన్నికల కోసం ఎన్నికల సంఘానికి సుమారు 48 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లు అవసరం అవుతాయన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అంతా భోళాశంకరుడి ఆశీస్సులే : ప్రధాని నరేంద్ర మోడీ

తనకు భోళాశంకరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌ ...

news

విదర్భలో 20 మంది రైతులు మృతి.. కంటిచూపు కూడా కోల్పోయారు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు ...

news

హనీప్రీత్ సింగ్ అల్లర్లకు అంతించ్చిందా? 17సిమ్‌లు వాడిందా? ఐరాస ట్వీట్ సంగతేంటి?

సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో ...

news

రెండుసార్లు పెళ్లిచేసుకున్నారు.. అయితే భర్తకు షాక్ ఇచ్చింది.. ఎలా?

ఓ యువతి ఏడాది వ్యవధిలోనే ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో ...

Widgets Magazine