శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:04 IST)

విచారణ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి.. మహారాష్ట్రది అదే వాదన

విభజన బిల్లులోని వ్యాకరణాలను పట్టుకుని తిరిగి నీటి పంపిణీ చేపట్టాలనుకుంటే ఎలా? విడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణ కింద కేటాయించిన నీటిని యధాతథంగా ప్రాజెక్టుల వారిగా పంపిణీ చేస్తే సరిపోతుంది. దీంతో మహారాష్ట్రను లాగాల్సిన అవసరమేలేదని ఆ రాష్ట్రం తన వాదనను బ్రిజేష్ కుమార ట్రిబ్యునల్ ఎదుట వినిపించింది. 
 
కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో రెండు రోజులుగా విచారణ జరుగుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా బుధవారం కర్ణాటక తన వాదనను వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం చేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను మహారాష్ట్ర గురువారం కూడా అదే కోరింది. 
 
ఢిల్లీలో ట్రి బ్యునల్ ముందు జరుగుతున్న విచారణలో మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది అంద్యార్జున రెండో రోజూ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ తుది తీర్పుతో కేటాయింపుల అంశం పూర్తయిందని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా పంచుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాదన విన్న తరువాత తుది తీర్పు వెలువడుతుంది.