గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (10:40 IST)

గూఢచర్యం కేసులో బీఎస్ఎఫ్ జవానుతో సహా ఆరుగురి ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్టు

గూఢచర్యం కేసులో ఒక భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) జవానుతో సహా మొత్తం ఆరుగురు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా డబ్బు కోసం ఐఎస్ఐకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ... భారత రక్షణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్టు తేలింది. దీంతో వీరిని కోల్‌కతా పాటు కోల్‌కతాలో అరెస్టు చేశారు. 
 
అరెస్టు అయిన వారిలో ఖఫైతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజాతో పాటు బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్‌లు పాక్ ఇంటెలిజెన్స్‌కు పనిచేస్తున్నారు. వీళ్లను జమ్మూలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గుర్ని కోల్‌కత్తాలో అదుపులోకి తీసుకున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్‌ఐ ఏజెంట్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ-మెయిల్, వాట్సాప్, వైబర్ నెట్‌వర్క్ ద్వారా సమాచారా బదిలీ జరుగుతోంది. భారత సైనిక దళాల మోహరింపు, వైమానిక కార్యకలాపాల గురించి మాస్టర్ రాజా పాక్‌కు సమాచారాన్ని ఎప్పటికప్పుడూ అందిస్తున్నాడు. రాజౌరీ జిల్లాలో ఖఫైతుల్లా ఖాన్ ఓ స్కూల్‌లో లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేశాడు. గూఢచర్యం రాకెట్ నిర్వహిస్తున్న ఖఫైతుల్లా, రషీద్‌లకు ఐఎస్‌ఐ సహకారం అందిస్తోంది. ఈ ఇద్దరూ బంధువులే. 
 
కోల్‌కతాల్లో 51 ఏళ్ల ఇర్షాద్ అన్సారీతో పాటు అతని కుమారుడు అస్ఫక్ అన్సారీ, మొహ్మద్ జహంగీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అన్సారీకి కరాచీలో బంధువులు ఉన్నారు. అతను అక్కడికి వెళ్లినప్పుడు ఐఎస్‌ఐ వాళ్లను లోబరుచుకుంది. సుమారు పదేళ్ల నుంచి అన్సారీ ఐఎస్‌ఐకి పనిచేస్తున్నాడు. వాళ్ల నుంచి అనేక డాక్యుమెంట్లతో పాటు నకిలీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.