గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం.. ఐటీకి లెక్కలు చెప్పిన మైనింగ్ కింగ్.. కొన్నిచోట్ల పొంతన లేదట..

బుధవారం, 30 నవంబరు 2016 (08:40 IST)

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని అంగరంగవైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహ పత్రిక వెరైటీగా ముద్రించారు. ఈ పత్రికే పెద్ద సంచలనంగా మారింది. పత్రికతో పాటు వివాహ వేడుకలను కూడ అంతే ఘనంగా ఆయన నిర్వహించారు. అయితే గాలి కూతురు వివాహంపై ఐటీ కన్ను పడింది. 
 
అంగరంగ వైభవంగా, అట్టహాసంగా కూతురి పెళ్లి చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దృష్టిలో పడిన అక్రమ గనుల కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి.. ఆ పెళ్లి ఖర్చులపై వివరాలు ఇచ్చారు. ఆ మేరకు ఐటీ శాఖకు ఆయన లెక్కలు సమర్పించారు. తాము అడిగిన 15 ప్రశ్నలకు గాలి జనార్దన్‌రెడ్డి సమగ్ర వివరాలు అందజేశారని ఐటీ అధికారులు వెల్లడించారు. 
 
పెళ్ళి మండపం, అలంకరణ, భోజన ఏర్పాట్లు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకారులు, అర్చకులకు చెల్లించిన పైకం వంటి తదితర  వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ తమ వద్ద ఉన్న వివరాలకు ‘గాలి’ సమర్పించిన వివరాలకు కొన్ని చోట్ల పొంతన కుదరడం లేదని.. అవసరమైతే గాలిని ప్రశ్నించేందుకైనా రెడీ అని ఐటీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఆర్డీఏలో పారదర్శకతకు పెద్దపీట

అమరావతి: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో పారదర్శకత ...

news

చింత చచ్చినా పులుపు చావలా... పదవీ విరమణ చేస్తూ భారత్‌కు వార్నింగ్... పాక్ ఆర్మీ చీఫ్

మన పెద్దలు కొంతమంది చేసే పనులు, మాట్లాడే మాటలను బట్టి సామెతలు చెప్పారు. పాకిస్తాన్ ...

news

విజయవాడ 'కంత్రీ' కాంతారావు... లెక్చరర్లను అలా వాడుకున్నాడు... టార్గెట్ 48X2,50,000=రూ.1.2 కోట్లు

సి.ఎల్.కాంతారావు పేరు విజయవాడలో చాలా పాపులర్. ఎందుకంటే ఆయన చేసే వ్యాపారాలు అన్ని ఉంటాయి. ...

news

అమ్మాయికి ఇష్టమైతే... మైనర్ బాలుడితో సహజీవనం చేయొచ్చు: హైకోర్టు సంచలన తీర్పు

ఓ ప్రేమ జంట విషయంలో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లీడురాని అబ్బాయిని ...