Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేసిన తప్పులకు మన్నించండి ఓటరు దేవుళ్లారా.. తన చెప్పుతో తానే దండించుకున్న మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్, మంగళవారం, 31 జనవరి 2017 (02:58 IST)

Widgets Magazine
election commission of india

తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ చేసుకునే అవకాశం ఈసారి తప్పక కల్పించండి అంటూ ఓటర్లకు విన్నపాలు చేసుకునే రాజకీయ నేతలను, అభ్యర్థులను చాలామందిని చూశాం. కానీ చెప్పులతో తన్ను తాను ఎడా పెడా వాయించుకుని మరీ ఓటర్లకు క్షమాపణలు చెప్పిన అరుదైన ఘటన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలలో జరిగింది. 
 
యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన, అనుకోని ఘటన చోటుచేసుకుంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలైన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షుజాత్ ఆలం ఈసారి కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈయన బీఎస్పీ అభ్యర్థి హజీఅలీంపై పోటీ చేస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం బులందర్‌షహర్‌లో షుజాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఒక్కసారిగా కాలి షూ తీసి ఆ చెంప, ఈ చెంప ఎడాపెడా వాయించుకున్నారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించాలని కోరుతూ ప్రజల సమక్షంలో చెంపలు వాయించుకుని తనకు తానే దండించుకున్నారు. 
 
గతంలో చేసిన తప్పులకు తనను క్షమించి ఈసారికి మటుకు ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. దీంతో అవాక్కవడం ప్రజలవంతైంది. అభ్యర్థి తనను తాను దండించుకున్న వీడియో సోషల్ మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్ అయింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కేంపెయిన్ అభ్యర్థి చెప్పు దండన వేడికోలు. Punish Himself Requesting Voters Ex Mla Own Shoe

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ దెబ్బకు దారికొస్తున్న పాక్: హఫీజ్ సయీద్‌ హౌస్ అరెస్ట్: జమాత్ ఉద్ దవాపై నిషేధం?

భారత్‌కు నిజంగానే ఇది తీపి కబురు. దశాబ్దాలుగా భారత్‌పై విద్వేషమే ఊపిరిగా బతుకుతూ ...

news

ముస్లిం శరణార్థులకు ఉద్యోగాలు, బీమా మేమిస్తాం: అమెరికా సీఈఓల తిరుగుబాటు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సాఫ్ట్ వేర్, తదితర దిగ్గజ కంపెనీలు తిరుగుబాటు ...

news

శరణార్థులపై ఆంక్షలు కాదు ఉగ్రవాదులకోసం కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య: గయ్ మన్న ట్రంప్

వివాదాస్పదమైన వలస నిరోధక ఆదేశంపై యావత్ ప్రపంచం మండిపడుతుండగా లైట్ తీసుకోండంటూ అమెరికా ...

news

ముస్లింలను ఒక్కతాటికి వచ్చేలా చేసిన ట్రంప్ మహాశయా నీకు జోహార్లంటున్న జిహాదీలు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏడు ముస్లిందేశాల ప్రజలకు బద్దశత్రువుగా ...

Widgets Magazine