Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోల్డెన్ బే రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేల ఎంజాయ్‌మెంట్.. పన్నీర్ వెంట పోతారా? చిన్నమ్మకు ఓటేస్తారా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:45 IST)

Widgets Magazine

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం  పన్నీర్ సెల్వం చెంతకు తన క్యాంప్ ఎమ్మెల్యేలు చేరిపోకుండా శశికళ అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోకుండా, పన్నీర్‌సెల్వం చెంతకు చేరకుండా ఆపేందుకు అందర్నీ తన కట్టుబాటులో పెట్టుకొనే ప్రయత్నానికి దిగారు. అందరినీ రెండు బస్సుల్లో నగరానికి దూరంగా రిసార్ట్స్‌లో ఉంచారు. ఈ చర్యతో శశికళ తీవ్ర విమర్శలు, కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
తన క్యాంప్ ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ హోటల్‌పై దృష్టి పెట్టింది. గత బుధవారం అన్నాడీఎంకే కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తరువాత 120 మందికిపైగా ఎమ్మెల్యేలను రెండు లగ్జరీ బస్సుల్లో శశికళ ఎక్కించి పంపించివేశారు. తొలుత విమానాశ్రయం సమీపంలోని స్టార్‌ హోటల్‌లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేయగా, రాత్రికి వారి బస మహాబలిపురం సమీపంలోని కల్పాక్కం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్‌కి మారింది. ఈ రిసార్టు ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కూవత్తూర్‌ ప్రాంతంలో ఉంది. చుట్టూ నీళ్లతో ఒక దీవిని తలపించేలా ఈ రిసార్ట్ ఉంటుంది. 
 
అంతేకాదు, చల్లగా వీచే సముద్రగాలి ఈ రిసార్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ హోటల్‌లో ఎమ్మెల్యేలు లగ్జరీగా గడిపేందుకు రోజుకి రూ.5,500, రూ.6600, రూ.9,900ల ధరతో మూడు విధాలైన రూములున్నాయి. పార్టీ హాలు, డిన్నర్‌ హాలు సదుపాయాలున్నాయి. షికారు చేసేందుకు బోటింగ్‌, బోటులోనే డిన్నర్‌, సాహస క్రీడల్లో ఆసక్తి ఉన్నవారి కోసం ట్రెక్కింగ్‌, మోటార్‌ సైక్లింగ్‌ వంటి మరిన్ని వసతులున్నాయి. మసాజ్‌ సెంటర్‌, జిమ్‌‌కూడా ఇందులో భాగమే. 
 
దీంతో ఈ రిసార్టులో ధనవంతులు, విదేశీ పర్యాటకులు మాత్రమే బస చేస్తుంటారు. గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు సకల సదుపాయాలూ ఉన్నాయి. అయితే వారిని బయట వ్యక్తులతో, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా చేశారన్నది వివాదాస్పదంగా మారింది. సెల్‌ఫోన్లు కూడా లాగేసుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు వాపోగా, మరికొందరు రిసార్టులో బాగానే ఎంజాయ్‌ చేశారని చెప్పుకొంటున్నారు. విలాసవంతంగా హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు చిన్నమ్మకు విశ్వాసంగా ఉంటారో లేక అమ్మకు విధేయుడైన పన్నీర్‌కు ఓటేస్తారో తెలియాలంటే వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

20మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారా? పన్నీర్‌కు సపోర్ట్‌గా ఓటేస్తారా? ఓపీఎస్ వేషం వేస్తున్నారా?

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ...

news

పన్నీర్ ప్రధాన అస్త్రం అదే... మ్యాజిక్ ఫిగర్ 117... సెల్వం పక్షాన 15 మంది... ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అసెంబ్లీలో బల నిరూపణ చేసేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ...

news

తమిళ తకరారు : నిర్ణయం గవర్నర్ చేతిలో.. పన్నీర్ దూకుడు... చిన్నబోయిన శశికళ

తమిళ తకరారు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మంకుపట్టి కూర్చొన్న ఆపద్ధర్మ ...

news

వావివరసలు మరిచి విచ్చలవిడితనం... ఒకే కుటుంబంలో నలుగురితో సంబంధాలు...

ఓ కామాంధుడు వావివరసలు మరిచిపోయాడు. కామపైశాచికత్వంతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఫలితంగా ...

Widgets Magazine