గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (14:00 IST)

మోడీ పనితీరుపై భారీ అంచనాలొద్దు: ఆర్బీఐ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనితీరుపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పనితీరుపై అవాస్తవిక అంచనాలను ప్రజలు, కార్పొరేట్లు పెంచుకున్నారని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడేలా అడుగులు పడుతున్నాయని రాజన్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో రాజన్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజన్ ఎకనామిక్ క్లబ్‌లో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం మోడీ కొత్త ప్రభుత్వాన్ని స్థాపించిన తరువాత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు పెరిగిపోయాయని, 'రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రజలకు ఎన్ని అంచనాలున్నాయో అన్ని అంచనాలను భారతీయులు మోడీపై పెట్టుకున్నారు' అని తెలిపారు. అయితే ఇలాంటి భారీ అంచనాలు సరికావని రాజన్ వివరించారు. సున్నితాంశాలపై ఇన్వెస్టర్ల మనోభావాలు దెబ్బతినకుండా ముందడుగు వేయడం కష్టమని ఆయన అన్నారు.