మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (12:14 IST)

ఆగ్రాలో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. ఎందుకో తెలుసా?

సామాన్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మనుషులే చేయించుకుంటారు. కానీ కోతులకు కూడా కుటుంబ నియంత్రణ పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం ఎప్పుడైనా విని వున్నారా...? ప్రస్తుతం మీరు చదువుతున

సామాన్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మనుషులే చేయించుకుంటారు. కానీ కోతులకు కూడా కుటుంబ నియంత్రణ పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం ఎప్పుడైనా విని వున్నారా...? ప్రస్తుతం మీరు చదువుతున్నది నిజమే. ఆగ్రాలో కోతులకు ఈ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే ఇలా చేయడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే అడవుల్లో విచ్చలవిడిగా సంచరించే కోతులు ఇప్పుడు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. 
 
కనిపించిన వారిపై దాడికి చేస్తున్నాయి. ప్రేమ మందిర నగరం ఆగ్రాలో కోతుల సంచారంతో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలని తగ్గించాలని ఓ స్వచ్ఛంద సంస్థ వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రా అధికారులు కనిపిస్తున్న కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ వ్యాక్సిన్‌లను ఇస్తున్నారు. గత మార్చిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 
 
ఆగష్టు చివరి నాటికి 500 కోతులకు వ్యాక్సినేషన్, స్టెరిలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు ఇప్పటిదాకా 317 కోతులకు విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేశారు. ఒక ఆడ కోతి ఏడాదిన్నరలో మూడు పిల్లలకు జన్మనిస్తుంది. ఇదే వేగంతో వాటి సంతానోత్పత్తి ఉంటే వచ్చే ఆరేళ్లలో ఆగ్రాలో కోతుల సంఖ్య 2.16 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అధికారులు కోతులకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు.