శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (09:33 IST)

రామేశ్వరంలో కలాం భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి.. క్యూ కట్టిన జనం

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయాన్ని తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన సొంతింటిలో ఉంచారు. కలాం పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు భారీ క్యూ ఏర్పడింది. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తకు నివాళి అర్పించేందుకు తమిళులు పెద్ద సంఖ్యలో అక్కడ బారులు తీరారు.

మూడు రోజుల క్రితం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఐఐటీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కలాం ఒక్కసారిగా కుప్పకూలి ఆస్పత్రికి తరలించేలోగానే తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత తొలుత ఢిల్లీ, తదనంతరం మధురై మీదుగా కేంద్ర ప్రభుత్వం ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరంలోని ఆయన సొంతింటికి చేర్చిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 11 గంటలకు కలాం భౌతిక కాయానికి రామేశ్వరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
 
ఇదిలా ఉంటే గుండెపోటు కారణంగా కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడారు. 2004లో కలాం తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని కూడా చేర్చారని వినోద్ తెలిపారు. అందరితోనూ సంప్రదింపులు జరిపి సరైన సమయంలో తెలంగాణ ఇస్తామని కలాం పేర్కొన్నట్టు చెప్పారు. రాష్ట్రపతి నోట తెలంగాణ మాట విని ఓ పార్లమెంటు సభ్యుడిగా ఎంతో ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు.