శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (12:53 IST)

అరుణ్ జైట్లీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక...

అనారోగ్య సమస్యలు  కేంద్ర మంత్రులను పట్టుకుని పీడిస్తున్నాయా అనే అనుమానం వస్తోంది. ఈమధ్యనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఐతే ఆ తర్వాత కోలుకుని విధులకు హాజరయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జైట్లీ చేరారనీ, ఆయన వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారని చెపుతున్నారు. 
 
ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లీకి మైనర్ ఆపరేషన్ జరగనుందని చెప్పిన ఆ వర్గాలు, ఏ కారణంగా ఆపరేషన్ జరగనుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించాయి. 
 
వంద రోజుల క్రితం గద్దెనెక్కిన మోడీ సర్కారులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది రోజులకే బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించారు. 
 
మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గత నెలలో ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా అరుణ్ జైట్లీ కూడా మైనర్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.