గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:23 IST)

జీఎస్‌టీ అమలు ఆలస్యమైతే ఆదాయానికి గండి.. అరుణ్ జైట్లీ..!

ప్రతిపాదిత గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్‌టీ) అమలు ఆలస్యమైతే ఆదాయానికి గండిపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయం వ్యక్తంచేశారు. జీఎస్‌టీ అమలు విషయమై పార్లమెంట్ వేదికగా సభ్యులు లేవనెత్తిన సందేహాలపై ప్రశ్నించగా, ఈ విషయాన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సాధ్యమైనంత త్వరగా జీఎస్‌టీ అమలు చేయాల్సి వుందని అన్నారు. ఏ దశలోనైనా జీఎస్‌టీ అమలు ఆలస్యమైతే రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. గడచిన 12 సంవత్సరాల నుంచి జీఎస్ టీ అమలు దిశగా చర్చిస్తూనే ఉన్నామని, ఇప్పటికైనా చర్చలు ముగించి, ముందడుగు వేసేందుకు సహకరించాలని యూపీఏ పార్టీలను జైట్లీ కోరారు. కాగా ఈ వస్తు సేవల పన్నును తమిళనాడు మినహా పెద్ద రాష్ట్రాలన్నీ స్వాగతించిన సంగతి తెలిసిందే.