మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (12:23 IST)

లాలూ జైలు కాటేజీకి భార్య కూడా అనుమతి... గేదెలు కూడా...

గడ్డి స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ళ జైలు శిక్ష విధిస్తూ రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష విధించింది. దీంతో ఆయనను హజారీబాగ్‌ జైలుకు తరలించారు.

గడ్డి స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ళ జైలు శిక్ష విధిస్తూ రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష విధించింది. దీంతో ఆయనను హజారీబాగ్‌ జైలుకు తరలించారు. ఈ జైలు ప్రత్యేకత ఏంటంటే 20 ఎకరాల్లో విస్తరించివున్న ఓపెన్ ఓపెన్‌ జైలు. ఇందులో 100 కాటేజ్‌లు ఉన్నాయి. ఒక్కో కాటేజ్‌లో ఒక గది, వంట గది, అటాచ్డ్‌ బాత్‌రూం ఉంటాయి.
 
ఒక్కో కాటేజ్‌లో ఓ ఖైదీతో పాటు తన భార్య, చిన్న పాప/బాబుతో ఉండొచ్చట. పైగా, జైల్లో ఆవులు, గేదెలు కూడా ఉంటాయి. ఈ ఆవులు, గేదెల పర్యవేక్షణ ఈ ఖైదీలు చూడాల్సి ఉంటుంది. పైగా, బిర్సాముండా జైలులో తాగునీరు సరిగా లేదని జడ్జికి లాలూ ఫిర్యాదు చేయడంతో హజారీబాగ్ జైలులో ఆర్.వో వాటర్ యంత్రాన్ని కూడా అమర్చుతున్నారట. మొత్తంమీ దాణా స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ జైల్లో రాజయోగం అనుభవించనున్నారు. 
 
మరోవైపు, లాలూ ప్రసాద్‌ ఏకైక సోదరి గంగోత్రి దేవి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయాన్ని లాలూకు తెలియజేశామని, పెరోల్‌పై వచ్చి సోదరి అంత్యక్రియల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ వెల్లడించారు.