విడాకులు కోరుతున్నారా? ఆర్నెల్లు ఆగక్కర్లేదు : సుప్రీంకోర్టు

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (06:28 IST)

divorce

భార్యాభర్తలు ఒకరిఒకరు వేరుపడాలని (విడాకులు) నిర్ణయించుకున్నప్పుడు వారికి ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ విడాకుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్న ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ ఆరు నెలల కూలింగ్  పిరియడ్‌ను సవరించి విడాకులు మంజూరు చేయల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
నిజానికి 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఆరు నెలల వరకు డైవోర్స్ మంజూరు చేయడానికి వీల్లేదు. దరఖాస్తుదారుల మనసులు మారే అవకాశం ఉండడంతో చట్టంలోని 13బి (2) సెక్షన్ ఆరు నెలల పాటు కూలింగ్ పిరియడ్‌ (కూలింగ్ ఆఫ్ రూల్)ను పేర్కొంది. 
 
భార్యభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని సూచన చేసింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ...

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ...

news

దుబాయ్‌లో రోబో పోలీస్....

ప్రపంచంలోని తొలి రోబో కాప్ దుబాయ్‌లో ఇటీవలే విధుల్లో చేరింది. ఐదడుగుల ఐదంగుళాలు వున్న ఈ ...

news

ఏపీలో పావుగంటలో పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్

అమరావతి: ప్రజల సౌకర్యార్ధం రెవెన్యూ శాఖలో వినూత్నమైన మార్పులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి ...