శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (14:43 IST)

భావ వ్యక్తీకరణకు సుప్రీం సపోర్ట్... సెక్షన్ 66ఏ కొట్టివేత...!

ఆధునిక సమాజంలో ప్రముఖ నేతలే కాకుండా ప్రజలు కూడా భావ వ్యక్తీకరణకు సామాజిక మాధ్యమాలను, వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. ఈ స్థితిలో పౌరుల భావ వ్యక్తీకరణ హక్కుకు అడ్డంగా ఉందంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన కోర్టు, సెక్షన్ 66ఏ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. 
 
వెబ్ సైట్లో నేరపూరిత అంశాలు ఉంచితే ఈ సెక్షన్ కింద అరెస్టు చేసి, మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అధికారం ఉందని పేర్కొంది. ఈ సెక్షన్ పై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాని గుర్తుచేసింది. ఈ క్రమంలో పౌరుల భావ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 66ఏ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ సెక్షన్ ను సవాలు చేస్తూ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సహా న్యాయ విద్యార్థిని శ్రేయా సింఘాల్ లతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు పిటిషన్‌లు దాఖాలు చేశాయి. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి సెక్షన్లను రద్దు చేయాలని కోరారు.