గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (16:47 IST)

17 యేళ్ళ బాలుడు.. 26 యేళ్ల యువతి... ఫేస్‌బుక్‌లో చాటింగ్.. హోటల్‌లో సెక్స్‌.. ఆపై కేసులు పెట్టుకున్నారు!

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 17 యేళ్ల బాలుడు.. 26 యేళ్ళ యువతి హోటల్‌లో సెక్స్‌లో పాల్గొని.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇదేదో సినిమా సస్పెన్స్ కథలా సాగినప్పటికీ... నిజంగా ఢిల్లీలో జరిగింది. త

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 17 యేళ్ల బాలుడు.. 26 యేళ్ళ యువతి హోటల్‌లో సెక్స్‌లో పాల్గొని.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇదేదో సినిమా సస్పెన్స్ కథలా సాగినప్పటికీ... నిజంగా ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫేస్‌బుక్‌లో జిందా పేరుతో ఉన్న 26 ఏళ్ల యువతితో ఓ 17 ఏళ్ల బాలుడు పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య స్నేహం మరింతగా బలపడటంతో ఇద్దరూ ప్రత్యక్షంగా కలిసి ఏకాంతంగా (సెక్స్) గడపాలని భావించారు. ఇందుకోసం ముహూర్తం నిర్ణయించుకుని ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో కలిసి గదిని అద్దెకు తీసుకున్నారు. 
 
ఆ తర్వాత వారిద్దరూ ఒక రాత్రంతా శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ యువతి పోలీసులకు ఫోన్‌ చేసి, తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అవాక్కైన ఆ బాలుడు... కొద్దిసేపటికి తేరుకుని మహిళపై రివర్స్‌లో కేసు పెట్టాడు. తనతో ఏకాంతంగా గడిపేందుకు ఆ యువతే ఆహ్వానించిందని, లైంగిక సంబంధం కోసం బలవంతం చేయడంతోనే తాను అంగీకరించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు ఇద్దరిపైనా కేసులు పెట్టారు. బాలుడిపై అత్యాచారం కేసు, యువతిపై ‘పోస్కో’ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.