Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్‌ పిటిషన్లు: మార్చి 30న విచారణ

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:49 IST)

Widgets Magazine

ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. ఇందుకోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 (1), ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. 
 
దీనిపై చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ ఎన్ వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు చాలా ముఖ్యమైనవని.. ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని.. అందుచేత విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Centre Personal Laws Fundamental Rights Suprem Court Triple Talaq

Loading comments ...

తెలుగు వార్తలు

news

శనివారమే బలపరీక్ష.. డీఎంకే మద్దతు పన్నీర్ సెల్వానికా? పళని స్వామికా..?

తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శనివారం బలపరీక్షకు రంగం సిద్ధం అవుతోంది. కొత్త సీఎం ...

news

ప్రేమ పేరుతో మోసం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రేమిస్తున్నానని, పెళ్లి ...

news

ఇస్రో సాధించిన విజయం చాలా చిన్నది.. అక్కసు వెళ్లగక్కిన చైనా ప్రభుత్వ పత్రిక

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ...

news

పన్నీర్‌కు జైకొడుతున్న వన్నియర్, దళిత ఎమ్మెల్యేలు... క్షణక్షణం మారుతున్న వ్యూహాలు!

అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. లేఖలో పేర్కొన్నట్టుగా ...

Widgets Magazine