శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 27 మే 2015 (08:21 IST)

గాడ్జెట్ గాజ్..! ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వ్యభిచారం...!! షాక్ తిన్న కౌన్సిలర్

‘ నా స్నేహితులు  దగ్గర మంచి మంచి  ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...’ ఇలా కౌన్సెలింగ్లో ఆ  అమ్మాయి చెప్పిన మాటలు విని  కౌన్సెలర్కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర  విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ఉండడం చూసి విస్తుపోయాడు. 
 
సుభాన్పురా ఏరియాలో గ్రాసరీ దుకాణం నడుపుకునే ఓ తల్లి తన పదమూడేళ్ల కూతురు గర్భవతి అనే తెలుసుకొని  షాకై అయింది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం నెత్తిన పడి కూతుర్ని అంతగా పట్టించుకోలేకపోయానని తల్లి వాపోతోంది. కాగా ఆనంద్  ప్రాంతానికి వీరు వ్యాపారం రీత్యా వడోదరాలో స్థిరపడ్డారు. ఈ అమ్మాయిని పసిపాపగా ఉన్నపుడే దత్తత తీసుకున్నారు. కాగా మూడేళ్ల  క్రితం ఆ అమ్మాయి తండ్రి చనిపోయినట్లు తెలుస్తోంది. గర్భవతి కావడానికి కూతురు చెప్పిన కారణాలు విని నిర్ఘాంత పోయింది.  
 
అలా  చేయడం తప్పని వారించింది. వ్యభిచారం నేరమని.. పద్ధతి మార్చుకోమని  బతిమలాడుకుంది.. కానీ ఆ అమ్మాయి వినలేదు. మరింత విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీంతో ఎలాగైనా ఆమెను దారిలో పెట్టాలనుకున్నతల్లి మేనమామగారింటికి పంపించివేసింది. కానీ ఆత్మహత్య చేసుకుంటానని కూతురు బెదిరించడంతో  ఇక చివరి ప్రయత్నించింది. గుజరాత్ లోని అభయం టోల్ఫ్రీ నెం. 85 ను సంప్రదించింది. ఫ్యామిలీ  కౌన్సెలర్  కౌన్సెలింగ్లో ఈ వెలుగులోకి వచ్చింది.