గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (13:38 IST)

భారత జాతిపిత మహాత్మా గాంధీకి నరేంద్ర మోడీ నివాళి!

భారత జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీలోని బాపూ ఘాట్‌లో ప్రధాని మోడీ, మహాత్ముడికి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు కూడా గాంధీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 
 
ప్రధాని మోడీ రాకకు ముందే, సోనియా, మన్మోహన్‌లు బాపూ ఘాట్‌కు చేరుకుని మహాత్ముడికి నివాళి అర్పించారు. ఉదయం 7.30 గంటల సమయంలో బాపూ ఘాట్ చేరుకున్న మోడీ, మహాత్ముడికి నివాళుర్పించిన అనంతరం అక్కడే కొద్దిసేపు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సమీపంగా కూర్చున్నారు. 
 
అలాగే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ జాతిపితకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని హైదరాబాదులో ప్రారంభించారు. రాజ్ భవన్ కాలనీలో ఉద్యోగులతో కలిసి గవర్నర్ దంపతులు రోడ్డు ఊడ్చారు. అంతేకాక నరసింహన్ పార పట్టి గడ్డి తొలగించారు. అనంతరం రాజ్ భవన్ ఉద్యోగులతో ఆయన 'స్వచ్ఛ భారత్' ప్రతిజ్ఞ చేయించారు.