శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (14:54 IST)

యువతి మర్మాంగంలో కారంపొడి పోసి గెరిటలతో గుచ్చి నరకం చూపించారు!

దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు ఇపుడు నేరాలు, ఘోరాలకు పెట్టింది పేరుగా మారుతోంది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కొత్త సంవత్సరల వేడుకల్లో పాల్గొని వస్తున్న యువతులపై కొందరు యువకులు సామూహిక ల

దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు ఇపుడు నేరాలు, ఘోరాలకు పెట్టింది పేరుగా మారుతోంది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కొత్త సంవత్సరల వేడుకల్లో పాల్గొని వస్తున్న యువతులపై కొందరు యువకులు సామూహిక లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ వేధింపులపై దేశ వ్యాప్తంగా నిరసలు వ్యక్తమయ్యాయి. ఇదిలావుండగా, ఇపుడు ఓ యువతిని కిడ్నాప్ చేసి.. ఆ యువతి మర్మాంగంలో కారంపొడి పోసి... గెరిటలతో గుచ్చి నరకం చూపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నందిని లేఔట్‌లో ఓ మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈనెల 15వ తేదీన ఆ బాలిక మాయమైంది. అదేప్రాంతంలో నివాసముంటున్న 19 ఏళ్ల యువతి ఇంటికి తరచూ వచ్చే వ్యక్తి ఈ మైనర్ బాలికను ప్రేమించి, మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనికి 19 యేళ్ల యువతి సహకరించిందని మైనర్ బాలిక తల్లిదండ్రులు అనుమానించారు. 
 
దీంతో ఈనెల 17వ తేదీన సమీపంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ఇంటికి అమ్మాయి కుటుంబ సభ్యులు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. ఆ యువతి మా ఇంటికి వస్తున్న వ్యక్తి కేఆర్ పురం సమీపంలోని టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడని చెప్పి అక్కడకు తీసుకు వెళ్లారు.
 
అయితే వారంతా అక్కడకు వెళ్లి చూడగా ఆ యువకుడు, మైనర్ బాలిక కనిపించలేదు. అంతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ వెంట వచ్చిన యువతిని ఆటోలో కిడ్నాప్ చేసి వారి ఇంటికి తీసుకొచ్చి నిర్భందించారు. తర్వాత యువతిని నగ్నంగా తయారు చేసి చిత్రహింసలు పెట్టారు.
 
అప్పటికీ వారి కోపం చల్లారక పోవడంతో ఆమె మర్మాంగంలో కారంపోడి పోసి గెరిటలతో గుచ్చి నరకం చూపించారు. ఇద్దరు వ్యక్తులకు మరో ముగ్గురు మహిళలు సహకరిస్తూ ఈ చిత్రహింసలు పెట్టారు. అయితే, వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. 
 
యువతి ఆమె తల్లి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు... ఈ చిత్రహింసలకు పాల్పడిన రుబినా తాజ్, యాస్మిన్, ఇందిరా, జబీర్, ఇమ్రాన్ అనే ఐదుగురు నిందితులను లేఔట్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.