శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (13:37 IST)

సెంట్రల్ జైలు ఆవరణలో కాల్పులు.. నేరస్థుడికి తీవ్ర గాయాలు..!

సెంట్రల్ జైలు ఆవరణలో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఒకరిపై ఒకరు కలబడే స్థితి నెలకొంది. అందరూ కలిసి కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో కరుడుకట్టిన నేరస్థుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పంజాబ్ లోని భటిండా  జైలు ఆవరణలో ఖైదీల మధ్య గ్యాంగ్వార్ నడిచింది. గురువారం ఉదయం గ్యాంగులు రెండూ కలబడ్డాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఈ కాల్పుల్లో కరడుకట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.  అతడ్ని ఆసుపత్రికి తరలించారు. 
 
పోలీసుల సమాచారం ప్రకారం ఆయుధాల కేసులో అండర్ ట్రయిల్ ఖైదీ కుల్బీర్ సింగ్ నౌరానాకు  ఈ కాల్పులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.