బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (15:30 IST)

బీఫ్‌‌తో వ్యాపారం చేస్తున్నారనీ ఆవు పేడ తినిపించారు... గోమూత్రం తాపించారు... ఎక్కడ?

ఆవు మాంసంతో వ్యాపారం చేస్తున్నారనీ, బీఫ్‌ను ఎగుమతి చేస్తున్నారన్న సందేహంతో ఇద్దరు ముస్లిం యువకుల పట్ల గో రక్షణ సమితి (గో రక్షా దళ్) అమానుషంగా ప్రవర్తించింది. ఆ ఇద్దరు ముస్లిం యువకులకు ఆవు పేడ తినిపించ

ఆవు మాంసంతో వ్యాపారం చేస్తున్నారనీ, బీఫ్‌ను ఎగుమతి చేస్తున్నారన్న సందేహంతో ఇద్దరు ముస్లిం యువకుల పట్ల గో రక్షణ సమితి (గో రక్షా దళ్) అమానుషంగా ప్రవర్తించింది. ఆ ఇద్దరు ముస్లిం యువకులకు ఆవు పేడ తినిపించారు. ఆ తర్వాత గోమూత్రం తాపించారు. ప్రస్తుతం ఈ అకృత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ దారుణం హర్యాణా రాష్ట్రంలో జరిగింది.
 
హర్యానా రాష్ట్రానికి చెందిన రిజ్వాన్, ముక్తియర్ అనే ఇద్దరు యువకులు ఆవు మాంసం ఎగుమతి చేస్తున్నారన్న సందేహంతో గో రక్షణ  సమితి సభ్యులు ఈ ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించారు. క్రమంగా బీఫ్‌ను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై భౌతికంగా దాడిచేసి పంచగవ్య తినిపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.  
 
గో రక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని సహచరులు గుర్గావ్‌లో ఇద్దరు యువకులు రిజ్వాన్, ముక్తియర్‌లపై ఈ దారుణానికి పాల్పడ్డారు.  యువకులిద్దరు 'పంచగవ్య'తో కూర్చొని ఉండటం, దాన్ని సులభంగా మింగడానికి గో రక్షణ కార్యకర్తలు నీళ్లు ఇవ్వడం.. తినమని గద్దించడం ఈ వీడియోలో చూడవచ్చు. 'గోమాత కీ జై',  'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు  చేశారు. 
 
దీనిపై ధర్మేంద్ర స్పందిస్తూ.. రిజ్వాన్, ముక్తియర్ అక్రమంగా ఆవు మాంసాన్ని మేవాత్ నుంచి ఢిల్లీకి  తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలనే పంచగవ్య (ఆవు మూత్రం.. పేడ. పాలు పెరుగు, నెయ్యిల మిశ్రమం) తినిపించామని తెలిపారు. దీని ద్వారా వారిని పరిశుద్ధులను చేశామన్నారు. దీన్ని వీడియో ఎవరు తీశారో, బయటికి ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు.