శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (19:32 IST)

మీరట్‌లో దారుణం: ప్రేయసిపై ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్!

మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని మాయమాటలతో నమ్మించి ఓ దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ తేదీన రెస్టారెంటుకు రావాలని ఆమెకు అతను ఫోన్ చేశాడు. అక్కడ అతని సోదరుడు, మరో స్నేహితుడు ఉన్నాడు. ఆమెను మాటల్లోకి దించి ఓ ప్రాంతానికి తీసుకు వచ్చారు.
 
తర్వాత మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వారు వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.