బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:25 IST)

ఎల్లోరా గుహలను ఆన్‌లైన్‌లో చూడొచ్చట.. 1400 కళాకృతులను..?

ఎల్లోరా గుహలను ఆన్‌లైన్‌లో చూడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన 1400 కళాకృతులను ఆన్‌లైన్‌లో వీక్షించనున్నారు. అలాగే సఫ్దర్‌జంగ్ సమాధులు, ఎల్లోరా గుహలు, పురాణ క్వీలా వంటి చారిత్రక ప్రాంతాలను గూగుల్ సాంస్కృతిక ఇన్‌స్టిట్యూట్ (జీసీఐ) వెబ్‌సైట్‌లో తిలకించవచ్చు. 
 
ఈ మేరకు చారిత్రక ఔన్నత్యం కలిగిన 76 ప్రాంతాలకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో చూడగలిగే ఛాయచిత్రాలను విడుదల చేస్తున్నట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. భారత ఆర్కియాలజీకల్ సర్వే (ఏఎస్‌ఐ) సహకారంతో వీటిని జీసీఐ సైట్‌లో అప్‌లోడ్ చేసినట్టు వివరించింది.