Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జై షాను వెనుకేసుకొస్తున్నారంటే తప్పు జరిగినట్టే : యశ్వంత్ సిన్హా

గురువారం, 12 అక్టోబరు 2017 (06:36 IST)

Widgets Magazine
Yashwant Sinha

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ అమిత్ షా కంపెనీ ఆస్తులు గత మూడేళ్లలో ఏకంగా 16 వేల రెట్లు పెరిగిన అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా స్పందించారు. బీజేపీ నేతలు జయ్ షాను వెనుకేసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తప్పుక జరిగినట్టుగానే భావించాలని అభిప్రాయపడ్డారు. 
 
పైగా, జాతీయ అధ్యక్షుడి కుమారుడిపైనే ఈ తరహా ఆరోపణలు రావడం బీజేపీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్టయిందన్నారు. జయ్ షా కేసును వాదించేందుకు ప్రభుత్వ ఉన్నత న్యాయవాది తుషార్ మెహతాను రంగంలోకి దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. జైషాకు విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ రుణం మంజూరు చేసిన విధానం, జైషాను వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్టు కనిపిస్తోందని, ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యశ్వంత్ సిన్హా కోరారు. 
 
కాగా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైషా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ‘ది వైర్’ అనే వెబ్‌సైట్‌లో ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేసిన జై షా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును వాదించడానికి న్యాయశాఖ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రంగంలోకి దిగారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిబద్ధత కలిగిన బార్బర్ ఏం చేశాడో చూడండి... (Video)

మనం చేసే పనిపై శ్రద్ధతోపాటు ఎంతో నిబద్ధత ఉండాలని పెద్దలు చెపుతుంటారు. అపుడే చేసే పనిలో ...

news

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద 6 నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం

అమరావతి: రాష్ట్రంలో స్వఛ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఆరు ...

news

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు... మంత్రి నారాయణ

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ...

news

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ ...

Widgets Magazine