బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 జులై 2015 (12:40 IST)

సభను స్తంభింపజేయడమే ఎన్డీయే వ్యూహంగా ఉంది : సీతారాం ఏచూరీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల కార్యక్రమాలను స్తంభింపజేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు వ్యూహంగా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలి నాలుగు రోజులు సభా కార్యక్రమాలు పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయిన విషయంతెల్సిందే. 
 
వీటిప ఏచూరీ స్పందిస్తూ... పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్నది ప్రభుత్వమేనన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లో 2జీ కుంభకోణంపై శీతాకాల సమావేశాలను మొత్తం స్తంభింపజేసిన బీజేపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కుంభకోణాలపై అదే విధానాన్ని ఎందుకు పాటించటం లేదన్నారు. 
 
మరోవైపు.. వ్యాపం, లలిత్‌గేట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు పదవుల నుంచి వైదొలిగేవరకు పార్లమెంటును నడువనిచ్చే ప్రసక్తేలేదని కాంగ్రెస్ నేత అశ్వినీకుమార్ స్పష్టంచేశారు. దీంతో వర్షాకాల సమావేశాలు సజావుగా సాగే పరిస్థితులు కనిపించడంలేదని ఆయన గుర్తు చేశారు.