Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నాడీఎంకేలో చీలిక.. డీఎంకే వ్యూహం.. త్వరలో ఎన్నికలు వస్తాయ్: స్టాలిన్ జోస్యం

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:33 IST)

Widgets Magazine

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. తమిళ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ చెన్నైకి రావొద్దని సూచించిన స్టాలిన్.. త్వరలోనే ఎన్నికలు వస్తాయని.. నాయకులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
 
బుధవారం ఆయన చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమైన స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి గవర్నర్ విద్యాసాగర్ రావు తెరపడేలా సత్వర చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.  అన్నాడీఎంకే పార్టీ చీలిపోయిన కారణంగా ఇరువర్గాల్లో ఎవ్వరూ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని స్టాలిన్ గుర్తు చేశారు. 
 
అందుచేత త్వరలో ఎన్నికలు రావడం ఖాయమని స్టాలిన్ నొక్కిచెప్పారు. ఇందుకోసం డీఎంకేలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను బట్టే స్టాలిన్ ఇలా మాట్లాడారని రాజకీయ పండితులు అంటున్నారు. త్వరలో అమ్మ పార్టీలో చీలిక ఏర్పడుతుందని వారు కూడా జోస్యం చెప్తున్నారు. దీంతో డీఎంకే పార్టీ లబ్ధిపొందుతుందని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Governor Delay Sasikala Paneerselvam Mk Stallin Horse Trading Tamil Nadu

Loading comments ...

తెలుగు వార్తలు

news

Mannargudi Mafia is Back... ఎమ్మెల్యేలను వదలం... తమిళనాడు డీజీపికే సవాల్?

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ ...

news

పళని వద్దు.. పన్నీరే ముద్దు.. చిన్నమ్మకు జైలులో కంపెనీ ఇస్తున్న పళని బంధువు..?

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. ...

news

అప్పుడు జయను చెన్నారెడ్డి... ఇప్పుడు శశికళను విద్యాసాగర్ రావు...

తెలుగు నాట సంభవించే రాజకీయ సంక్షోభాలకు, తెలుగు గవర్నర్లకు విడదీయరాని సంబంధం ఉంది. దేశ ...

ప్రపంచాన్ని ఇంకా వదలని హిట్లర్ భూతం: ఆస్ట్రియాలో అరెస్ట్‌

రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై నాడు ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత అడాల్ఫ్‌ ...

Widgets Magazine