Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు చెక్.. కేంద్రానికి గవర్నర్ నివేదిక... పన్నీర్‌కు అనుకూలమా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (22:23 IST)

Widgets Magazine
ops - sasikala - vidyasagar

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఓ నివేదిక పంపించారు. ఇందులో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తెగ ఉబలాటపడుతున్న శశికళకు చెక్ పెట్టేలా, చాలా తెలివిగా (ఇంటెలిజెంట్) నివేదికను తయారు చేసి పంపించినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి కేంద్రానికి పంపిన మూడు పేజీల లేఖ బహిర్గతమైంది. 
 
ఇందులో ఓ వైపు తమిళనాడులో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై రాజ్యాంగబద్ధంగా అన్ని విషయాలు పరిశీలించాకే ఓ నిర్ణయానికి రావాలన్న ఆలోచనలో గవర్నర్‌ ఉన్నారాని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్టికల్ 161(1) ప్రకారం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ, ఆర్టికల్‌ 164(4) ప్రకారం ఎమ్మెల్యే కాని వ్యక్తి కేబినెట్‌ సభ్యులుగా బాధ్యత తీసుకోవాలన్నప్పుడు ఆరు నెలలు లోగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే శశికళ విషయంలో అది సాధ్యమవుతుందా..? ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్నాయా..? అనే విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత జులైలో తీర్పును బట్టి చూస్తే పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్న దృష్ట్యా భవిష్యత్‌ పరిణామాలపై గవర్నర్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎం ఉన్నందున అధికార శూన్యత లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని గవర్నర్‌ విశ్వసిస్తున్నట్టు సమాచారం. అయితే రోజులు గడిచిన కొద్దీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించొచ్చన్న ఆందోళనలపైనా గవర్నర్‌ దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నివేదికపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించక పోవడంతో ఈ నివేదిక నిజమైనదా కాదా అని తేలాల్సి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ దుష్టురాలుగా, పన్నీరు సెల్వం హీరోగా.. ఎందుకు?

తమిళ రాజకీయాలపై తెలుగు మీడియా ఛానళ్ళ అత్యుత్సాహం ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగానే ఉంది. శశికళ ...

news

తమిళనాడులోకి ఆలస్యంగా బీజేపీ..! అభాసుపాలవ్వడం ఖాయమా?

చిత్ర విచిత్రంగా మారిన తమిళ రాజకీయాలు. కేంద్రం పాచికలు పారే అవకాశాలు ఉన్నాయా? చక్రం ...

news

2019 ఎన్నికలకు జనసేన సిద్దం కాదా..?

ప్రత్యక్ష రాజకీయాల్లోకి జనసేన ఇప్పుడే వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికిప్పుడు వచ్చినా ...

news

అమ్మ ఆత్మ శశికళపై కోపంతో తిరుగుతుందట.. అందుకే రాష్ట్రానికి ఇన్ని కష్టాలా?

దివంగత సీఎం జయలలిత ఆత్మ శశికళ మీద కోపంగా తిరుగుతోందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ...

Widgets Magazine