శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (13:06 IST)

వెస్ట్ బెంగాల్ : గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి.. తారా స్థాయికి మాటల యుద్ధం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య మాటల వాగ్యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టార

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య మాటల వాగ్యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. పైగా, గత మూడు రోజులుగా ఆమె ఆందోళన చేస్తున్నారు. 
 
దీనిపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ స్పందించారు. 'ఆర్మీలాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు' అని అన్నారు. 
 
దీనికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. 'గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం' అన్నారు. 
 
ఈ మాటలపై కూడా గవర్నర్ స్పందించారు. 'నేనేం చెప్పానో ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. వాళ్ల కిష్టమొచ్చింది (మమతా బెనర్జీ తదితరులు) మాట్లాడుకోని. నేను నా విధులు నిర్వర్తిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆర్మీని రాజకీయం చేయొద్దు.. విమర్శలు చేయకూడదు' అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.