Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ కలలు గల్లంతేనా.. గవర్నర్ మెలికతో ప్రమాణ స్వీకారం వాయిదా..!

హైదరాబాద్, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (06:06 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికల ఆశల సౌధానికి గండి పడే సూచనలు కనిపస్తున్నాయి. మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు సోమవారం ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై రాకుండా ముంబై వెళ్లిపోవడంతో ప్రమాణం స్వీకారం వాయిదా పడుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతుండటంతో నేడు ఏం జరగనుందనే అంశంపై రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 
శశికళతో ప్రమాణం చేయించే విషయంలో న్యాయ సలహా తీసుకోవడానికి గవర్నర్‌ ఢిల్లీ వెళ్లినట్లు మహారాష్ట్ర రాజ్‌భవన్  వర్గాలు చెప్పాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో వారంలోగా తీర్పునిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో గవర్నర్‌ ఏమి చేయబోతున్నారు అనే విషయంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఒక వేళ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. ఆ కేసులో ఆమె దోషిగా సుప్రీం తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. 
 
ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల్లో భాగం గా వ్యూహాత్మకంగానే శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారనే వారు విశ్లేషిస్తున్నారు. మరోపక్క సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టును పిల్‌ ద్వారా ఆశ్రయించింది. ఈ పిల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విచారించనుంది.  
 
ఇంకోపక్క శశికళ ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయించిన  మద్రాస్‌ యూనివర్సిటీ ఆడిటోరియాన్ని వేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడే జయలలిత కూడా ప్రమా ణ స్వీకారం చేశారు. ఇక సీఎం పన్నీర్‌ సెల్వం ఇచ్చిన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏ పదవీ వద్దు: పన్నీర్‌ సెల్వం తీవ్ర మనస్తాపం

తమిళనాడు రాజకీయాల్లో శరవేగంగా జరిగిన పరిణామాలతో సీఎం పదవిని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ...

news

ఏపీకే కాదు... తెలంగాణకూ కేంద్రం మొండిచెయ్యేనట: ధ్వజమెత్తిన జితేందర్

ఒకవైపు రాష్ట్ర విభజనతో కుప్పకూలిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోందని ...

news

ట్రంప్ నిర్ణయాలు భారత్ కొంప ముంచడం ఖాయం: చైనా హెచ్చరిక

భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ...

news

భారత్ ఎటు వెళ్తోందో ఎవరికీ తెలీదు.. మోదీకి అస్సలు తెలీదు..ట

పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో భారతదేశం ఎటు పోతోందో ఎవరకీ తెలీదని, ప్రధాని నరేంద్రమోదీకి ...

Widgets Magazine