శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (12:12 IST)

సుప్రీంకు 627 మంది పేర్లతో నల్లధనం కుబేరుల లిస్ట్.. షీల్డ్ కవర్‌లో...

సుప్రీంకోర్టుకు 627 మంది పేర్లతో కూడిన నల్లధనం కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ లిస్టును షీల్డ్ కవర్‌లో సమర్పించింది. నల్లధన కుబేరుల జాబితా పైన కేంద్రానికి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విదేశాల్లో డబ్బు దాచిన వారందరి పేర్లు బయట పెట్టాలని సూచించింది. బుధవారంలోగా జాబితా సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.  
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం 627 మంది పేర్లతో జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విదేశీ బ్యాంకుల్లో వారందరికీ ఖాతాలున్నాయి. అటార్నీ జనరల్ ముకుల్ రహతోగి నల్లధనం కుబేరుల జాబితాతో కూడిన మూడు సెట్ల డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించారు.
 
సీల్డ్ కవర్లలో జాబితాను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఒక జాబితాలో నల్లధనం కలిగి ఉన్నవారు పేర్లు, రెండో జాబితాలో విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి పేర్లు, మూడో జాబితాలో నల్లధనం కేసు వివరాలు ఉన్నాయి. వారి పేర్లను బయటపెట్టాలా, లేదా అనే విషయం సుప్రీంకోర్టుకు వదిలేస్తున్నామని, ఎవరిని కూడా రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.