బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:47 IST)

శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం.. అమ్మ స్మారకమండపం శంకుస్థాపన జరిగేనా?

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపం నిర్మాణం విషయంలో అన్నాడీఎంకే ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24వ తేది జయల

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపం నిర్మాణం విషయంలో అన్నాడీఎంకే ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి రోజున జరగవలసిన అమ్మ స్మారకమండప శంకుస్థాపన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారిపోయింది.
 
తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ చెరో దారిలో పోతూ అమ్మ స్మారకమండప నిర్మాణాన్ని నమూనా చిత్రంతోనే ఆపేశారు. కాగా 2016 డిసెంబర్ 5వ తేదిన జయలలిత మరణించడంతో చెన్నైలోని మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి సమీపంలోనే సమాధి చేశారు.ఎంజీఆర్ సమాధి సమీపంలోనే తన సమాధి ఉండాలని జయలలిత తన సన్నిహితులతో చెప్పుకునేవారు.
 
జయలలిత సమాధి ఉన్న చోట స్మారకమండపం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రూ. 15 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందుకోసం నమూనా చిత్రం సిద్ధం చేసే బాధ్యతను ఓ ప్రైవేట్ ఆర్కిటెక్‌కు అప్పగించారు. అర్కిటెక్ట్ తయారు చేసిన స్మారక నమూనా చిత్రాలను ప్రజాపనుల శాఖ అధికారులు సేకరించి ఓ కాపీని సీఎంకు, మరో కాపీని శశికళకు పంపించారు.
 
అయితే సీఎం పన్నీర్ సెల్వం చెప్పినట్లు కాకుండా శశికళ చేసిన మార్పులతో అమ్మ స్మారకమండపం నిర్మాణం పనులు జరగాలని పోయెస్ గార్డెన్ నుంచి ప్రజాపనుల శాఖకు ఆదేశాలు అందాయి. అమ్మ స్మారకమంపడం పనులు ప్రభుత్వం కనుసన్నల్లో జరగాలని సీఎం పన్నీర్ సెల్వం గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమ్మ స్మారక మందిరం ఏర్పాటు పనుల్లోనూ గొడవలు మొదలయ్యాయి. 
 
జయలలితకు ప్రీతిపాత్రమైన అంశాలను జోడించాలని సీఎం పన్నీర్ సెల్వం ఆర్కిటెక్ట్‌కు సూచించారని ప్రజపనుల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు. అయితే సీఎం మాటలు పట్టించుకోకుండా స్మారక నిర్మాణపండపం నమూనా చిత్రం తయారు చెయ్యాలని పోయెస్ గార్డెన్ నుంచి గట్టిగానే ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. పన్నీర్ సెల్వం-శశికళల మధ్య ప్రజా పనుల శాఖకు చెందిన అధికారులు నలిగిపోతున్నారు. కానీ ప్రభుత్వ కనుసన్నల్లోనే అమ్మ స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం గట్టి నిర్ణయంతో ఉన్నారు.