శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:32 IST)

ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరి వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు : గుజరాత్ సర్కారు

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీకి చెందిన ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో వీరికి 10 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అమలు చేస్తున్న 49 శాతం రిజర్వేషన్లకు ఇది అదనం. ఈ తరహా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా, ఆర్థికంగా బలపడిన పటేదార్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ఒత్తిడి కారణంగా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్లతో పటీదార్లు, బ్రాహ్మణులు, క్షత్రియ, లోహనాతో పాటు.. వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉన్న అన్ని జనరల్ కేటగిరీకి చెందిన ప్రజలు లబ్ధి పొందుతారు. కాగా, దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తీసుకునిరానుంది.