బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Eswar
Last Modified: సోమవారం, 28 జులై 2014 (20:13 IST)

గుజరాత్‌లో వివాదాస్పదమవుతున్న పాఠ్యాంశాలు

గుజరాత్ లోని పాఠ్యాంశాలు రోజురోజుకి వివాదాస్పదమవుతున్నాయి. ప్రజలు జన్మదినం ఎలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోందని మండిపడుతున్నారు. ఇది సాంస్కృతిక పోలీసింగ్ అన్న విమర్శలొస్తున్నాయి. కేక్‌లు కట్ చేయడం, కొవ్వొత్తులు ఆర్పడం వంటి పాశ్చాత్య సంస్కృతిని విడనాడి బర్త్ డే రోజు సంప్రదాయ స్వదేశీ దుస్తులు ధరించాలని గుజరాత్ పాఠ్యాంశాల్లో చేర్చారు. 
 
జన్మదినం సందర్భంగా హోమం జరిపించుకోవాలని గుజరాత్ పాఠ్యాంశాల్లో చొప్పించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. భిన్న మతాలు, సంస్కృతులున్న మనదేశంలో బర్త్ డే వేడుకల్ని ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు జరుపుకుంటారు. 
 
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, అసభ్యంగా ప్రవర్తించకుండా జన్మదిన వేడుకల్ని చేసుకుంటే తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, జన్మదిన వేడుకల్ని ఇలానే చేసుకోవాలని ప్రభుత్వమే నిర్ణయించడం ఏమేరకు సమంజసమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.