శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:53 IST)

గ్యాంగ్ రేప్‌కు గురైన మహిళ... గర్భస్రావానికి కోర్టు నిరాకరణ..!

ఆరు నెలల పాటు ఏడుగురు మృగాళ్ల చెరలో ఉండి, సామూహిక హత్యారానికి గురైన మహిళ గర్భాన్ని తొలగించుకునేందుకు గుజరాత్ హైకోర్టు అనుమతి నిరాకరించింది. వివరాల్లోకి వెళితే.. బోటడ్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఏడుగురు దుర్మార్గులు కిడ్నాప్ చేసిన బందీగా ఉంచుకుని, పలు మార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆరు నెలల తర్వాత వారి చెర నుంచి బయపడి ఆ మహిళ, తన గర్భాన్ని తొలగించుకునేందుకు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త ఆ బిడ్డను కనేందుకు అంగీకరించడం లేదని తెలిపింది. కాగా, వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జె బి పర్దివాలా ఆమె పిటిషన్‌ను తిరస్కరించారు. 
 
20 వారాల తర్వాత గర్భం తొలగించడం తల్లి ప్రాణానికి ప్రమాదమని, అందుకోసం న్యాయస్థానం గర్భస్రావానికి అనుమతించదని తీర్పు చెప్పింది. 20 వారాలకు మించి ఉన్న గర్భాన్ని తొలగించడానికి చట్టం అనుమతించదని పేర్కొంది. గర్భిణి శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రభుత్వం తరపున ఎన్జీవోల సాయంతో ఆమె బాగోగులు చూసుకోవాలని బోటడ్ జిల్లా కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
 
అంతేకాకుండా యువతి ధైర్యం తెచ్చుకుని శిశువుకు జన్మనీయాల్సిందేనన్నారు. ఆమె భవిష్యత్‌లో ఎన్ని అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుందో కోర్టుకు తెలుసునని, అయినా తప్పడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా ఆ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.