బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:11 IST)

'మేడ్ ఇన్ పాకిస్తాన్' దిబ్బలో కొట్టారు... ముస్లిం సోదరుల నిరసన...

యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడద

యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 
ముస్లిం ట్రేడర్స్ అసోసియేషన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తామే కాదు, పాకిస్తాన్ దేశం ఉత్పత్తులను మిగిలినవారు కూడా అమ్మవద్దని పిలుపునిచ్చారు. ముస్లిం వర్తకులు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ దేశానికి ఆర్థికంగా కాస్త ఇబ్బందిపెట్టే సమస్యే. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం తమ లక్ష్యమని ముస్లిం సోదరులు ప్రకటించారు.