Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీడియా పేరుతో బెదిరింపులు.. సీసీ కెమెరాతో చిక్కుకున్నారు..

బుధవారం, 17 జనవరి 2018 (15:02 IST)

Widgets Magazine
Crime

మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ''కమిలి'' వార్తా పత్రిక రిపోర్టర్ కృష్ణారావు బెదిరింపులకు దిగాడు. 
 
విలేకరి ఆటకట్టించాలనే ఉద్దేశంతో యువకులు ఆయనను చర్చకు పిలిచారు. గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆపై వారితో మాట్లాడేందుకు పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, విలేకరులు అప్పికొండ ప్రసాద్‌, దేవవరపు నరేష్ బాబు వచ్చారు.
 
సౌజన్య వారితో చర్చిస్తూ, ఆన్‌‌లైన్‌ ట్రేడింగ్‌‌ చేయాలంటే భారీగా జీఎస్టీ కట్టాల్సి వస్తుందని, విషయమంతా తమ పత్రికలో రాస్తే, కోటి రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సి వుంటుందని, తమకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే చివరికి రూ.20లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఈ వీడియోను పోలీసులకు ఆ యువకులు సమర్పించి.. ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Guntur Media Crime News Online Trading

Loading comments ...

తెలుగు వార్తలు

news

టాయ్‌లెట్ దానం చేయమంటున్న ఐఏఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ...

news

సంక్రాంతి కోడి పందేలు.. రూ.400 కోట్లు చేతులు మారాయట?

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ ...

news

వంగవీటి రాధ ఎంట్రీకి ముహూర్తం.. మల్లాది విష్ణుకు సీటు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ కేంద్రమైన విజయవాడలో బుధవారం రెండు ఆసక్తికర సంఘటనలు ...

news

బెంగళూరులో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు: సీఐ భార్య మెడలోని?

బెంగళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు పెట్టే ...

Widgets Magazine