Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గుర్మీత్ సింగ్‌ ఎవరు? అత్యాచార నిందితుడైనా.. మద్దతు ఎందుకు?

శనివారం, 26 ఆగస్టు 2017 (10:25 IST)

Widgets Magazine
Gurmeet Ram Rahim Singh

అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన గుర్మీత్ సింగ్‌కు మద్దతు తెలుపుతూ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ప్రజలు హింసకు పాల్పడుతున్నారు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్), ఎంఎస్‌జీ 2. ఈ నేపథ్యంలో గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదైనాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25 2017న తీర్పునిచ్చింది. 
 
ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ క్రమంలో రామ్ రహీమ్‌ను అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. రామ్ దోషి అని నిర్ధారించడంతో.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆయన మద్దతుదారులు ఆందోళనల బాట పట్టారు. అసలు అత్యాచార కేసులో ఇరుక్కున్న వ్యక్తికి ప్రజలు ఎలా ఎందుకు మద్దతు తెలుపుతున్నారంటే.. ఆగస్టు 15, 1967లో రాజస్థాన్‌లోని మోదియా గ్రామంలో పుట్టిన గుర్మీత్ సింగ్.. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే.. ఆధ్మాతిక చింతనతో వుండేవాడు. 
 
పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను ఏడు సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. అతనిని తన శిష్యుడిగా ప్రకటించాడు. అప్పుడు రామ్ రహీమ్ వయసు 23 ఏళ్లు. అప్పటికే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రహీమ్.. హర్జీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు వున్నారు.
 
ఆపై డేరా సచ్ఛా సౌధ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. రక్తదానం, అవయవదానం, పేద పిల్లలకు విద్యను అందించాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. ఇలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనపై అత్యాచార కేసులు రుజువైనప్పటికీ ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన గుర్మీత్ సింగ్‌కు మద్దతు తెలుపుతూ.. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పైలట్‌కు గుండెపోటు.. గాల్లో ప్రయాణికుల ప్రాణాలు... తర్వాత ఏమైంది?

కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌కు ఉన్నట్టుండి గుండెపోటు ...

news

బిడ్డ పురుషాంగాన్ని కోసి మొదటి భర్తకు కానుకగా పంపిన భార్య

చైనాలో ఓ దారుణం జరిగింది. తొలి భర్తకు పుట్టిన బిడ్డ పురుషాంగాన్ని ఏమాత్రం కనికరం లేకుండా ...

news

తల్లిగా కలెక్టర్ ఆమ్రపాలి... బిడ్డగా బొజ్జగణపయ్య.. ఈ వీడియో చూడండి...

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న కలెక్టర్లలో ఇద్దరికి మంచిపేరు ఉంది. వారిద్దరూ కూడా ...

news

సర్కస్‌‌లో ట్రైనర్‌పై టైగర్ దాడి... ఇట్స్ రియల్... (Video)

సర్కస్‌లో బోనులో ట్రైనర్‌పై పులి దాడి చేసి, స్టేజీ చుట్టూ లాక్కెళ్లింది. ఈ దాడితో ...

Widgets Magazine