Widgets Magazine

బీజేపీ కురువృద్ధుడికి నేతల శుభాకాంక్షలు...

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ తన 90వ పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు వివిధ పార్టీలకు చెందిన నేతలంతా శుభాక్షాంకలు తెలుపుతున్నారు.

lk advani
pnr| Last Updated: బుధవారం, 8 నవంబరు 2017 (12:34 IST)
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ తన 90వ పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు వివిధ పార్టీలకు చెందిన నేతలంతా శుభాక్షాంకలు తెలుపుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన అద్వానీ గారికి శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. "అద్వానీ ఒక రాజకీయ దిగ్గజం, ఒక మహానేత. దేశం కోసం అకుంఠిత దీక్షతో పని చేశారు. అద్వానీ నుంచి సలహాలు తీసుకోవడానికి బీజేపీ కార్యకర్తలంతా అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. బీజేపీ ఎదగడానికి అద్వానీ చేసిన కృషి మరిచిపోలేనిది", అని తెలిపారు.
అలాగే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "అద్వానీ గారూ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యావ్ ఏ లవ్లీ డే" అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, ఇతర పార్టీల నేతలు కూడా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.


దీనిపై మరింత చదవండి :