శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (14:13 IST)

మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : హార్దిక్ పటేల్

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువసంచలనం హార్దిక్ పటేల్ స్పష్టం చేశాడు. పైగా తమ ఆందోళనను జాతీయ స్థాయిలో చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేయడాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వాగతించడం లేదన్నారు. 
 
ఆదివారం ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ డిమాండ్‌ను, వాదనను బలంగా, మూడు ముక్కల్లో చెప్పేశారు. ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని తేల్చి చెప్పారు. తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని ప్రకటించారు. 
 
పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం తాము చేస్తున్న ఉద్యమంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి భాగస్వామ్యం లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం భారీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 
 
కాగా, గుజరాత్ రాష్ట్రంలోని పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్దిక్ పటేల్ నేతృత్వంలో గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా ఆదోళనలు కొనసాగుతున్న విషయంతెల్సిందే.