శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:09 IST)

భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా భారత సంతతి మహిళ సిధూ!

భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా భారత సంతతి మహిళ హరీందర్ సిధూ ఎంపికయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో భారత దేశంలో నియమితులైన భారత సంతతికి చెందిన రెండో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఈమే కావడం గమనార్హం. ప్రస్తుత హైకమిషనర్ పాట్రిక్ సక్‌లింగ్ స్థానంలో సిధూ బాధ్యతలు చేపట్టారు. 
 
పంజాబ్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళి అక్కడే స్థిరపడిన సిధూ భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హరీందర్ సిధూ మాట్లాడుతూ.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్‌లో దౌత్య ప్రతినిధి పాత్ర పోషించడంపై తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్‌లో తొలుత అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసి సిధూ.. ఆపై ఆఫీస్ ఆఫ్ నేషనల్ అసెస్‌మెంట్స్‌లో అసిస్టెంట్ డైరక్టర్‌గా, సీనియర్ అడ్వైజర్‌గా పీఎంవో క్యాబినెట్‌లోనూ పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో ఎకనామిక్స్‌‌పై యూజీ పూర్తి చేశారు.