శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 7 మార్చి 2015 (08:49 IST)

కానిస్టేబుల్.. అయితేనేం..? అమ్మాయేగా.. రోమియో వేధింపులు

రోమియోలు బరితెగిస్తున్నారు. తానో కానిస్టేబుల్ అని.. చెబుతున్నా.. అయితేనేం అమ్మాయివి కావా.. రా అంటూ వేధింపులకు దిగాడో యువకుడు. డ్యూటీలో తనను వేధిస్తావా అంటూ వాదిస్తే.. ఏం డ్యూటీలో ఉంటే సాధ్యం కాదా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. 
 
పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో తల్తలా ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో భాగంగా రోడ్డుపై నిలబడి ఉంది. ఆమెను ఓ యువకుడు వెంబడించాడు. మాటలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తానో కానిస్టేబుల్ నని చెబుతుంటే ఏం అమ్మాయివేగా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. 
 
మహిళా కానిస్టేబుల్ తల్తలా సమీపంలో తన విధి నిర్వహణలో ఉండగా.. ఆ యువకుడు ఆమెను అడ్డుకోవడమే కాక.. లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.