బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (12:45 IST)

రాబర్ట్ వాద్రా వ్యాపార సామ్రాజ్య వివరాలు సమర్పించండి : హర్యానా

హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన వ్యాపార సామ్రాజ్య పూర్తి వివరాలను తమకు అందజేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాన్ని కోరింది. ఈ మేరకు.. గుర్గావ్ పరిపాలన కార్యాలయానికి ఆదేశాలు వెళ్లాయి. 
 
రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీల, ఆస్తుల పూర్తి వివరాలు సమర్పించాలని తనను అడిగినట్టు గుర్గావ్ జిల్లా మేజిస్ట్రేట్ కమ్ డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థికి ల్యాండ్ రికార్డుల డైరెక్టర్ లేఖ రాశారు. దాంతో, స్పందించిన కమిషనర్ విద్యార్థి, వారం రోజుల్లో ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి తర్ సెమ్ శర్మను ఆదేశించారు. 
 
కాగా, ఇదే అంశంపై హర్యానా రాష్ట్ర సీనియర్ మంత్రులు  రామ్ బిలాస్ శర్మ, అనిల్ విజ్ మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై న్యాయ విచారణకు ఆదేశించడం జరిగిందని, అందువల్ల అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. 
 
మరోవైపు.. అమాయక రైతుల నుంచి 70 వేల ఎకరాల భూమిని సేకరించి రాబర్ట్ వాద్రా వంటి బడా పారిశ్రామికవేత్తలకు అతి తక్కువ ధరకు కేటాయించారు.