శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (14:43 IST)

పాన్‌వాలాకు దీపావళి గిఫ్ట్: రూ.132 కోట్ల విద్యుత్ బిల్లు!!

హర్యానాకు చెందిన ఓ పాన్‌వాలాకు దీపావళి గిప్ట్‌గా రూ.132 కోట్ల బిల్లు వచ్చింది. విద్యుత్ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయిన పాన్ వాలాకు హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు భారీ మొత్తంలో బిల్లును పంపింది. 
 
కరెంట్ బిల్లుని చూసిన తర్వాత రాజేష్ మాట్లాడుతూ "బిల్లుని చూసి షాక్‌కు గరయ్యాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా.. అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని అందులో పాన్ షాప్‌ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది' అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.