శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (08:36 IST)

పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!

హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది చెప్పుకున్నారు.
 
ఈ విషయమై పాన్ వాలా మాట్లాడుతూ ఇంత భారీ కరెంట్ బిల్లును చూసి షాకైపోయాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని నిశితంగా పరిశీలించగా అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉండటంతో షాక్‌కు గురయ్యాను. 
 
నా పాన్ షాప్‌లో కేవలం ఒక బల్బు, ఒక ఫ్యాన్‌ను మాత్రమే వినియోగిస్తున్నాను. ఇప్పటి వరకు నాకు నెలకు రూ.1000 లోపే బిల్లు వచ్చేది. ఈ నెల మాత్రం 132 కోట్ల రూపాయల బిల్లు రావడం విచిత్రంగా ఉందన్నాడు. సాధారణంగా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తే ముందు బిల్లు కట్టండి ఆ తర్వాత అడ్జెస్ట్ చేద్దామని చెప్పే అధికారులు ఇప్పుడు ఈ 132 కోట్ల విషయంలో ఏమంటారో చూడాలి.